Mulugu Accident: పోలీసు జీపు బోల్తా.. డ్రైవర్ సహా ఎస్సై మృతి - రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
15:30 May 02
Mulugu Accident: పోలీసు జీపు బోల్తా.. డ్రైవర్ సహా ఎస్సై మృతి
Mulugu Accident: ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏటూరు నాగారం మండలం జీడివాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్సై సహా మరో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరు నాగారం సెకండ్ ఎస్ఐ బి. ఇంద్రయ్య, కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ వాహనమైన బొలెరోలో ఓ ప్రైవేటు డ్రైవర్ రాజుతో కలిసి మంగపేట వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు జీడివాగు సమీపంలో అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో ఎస్ఐ ఇంద్రయ్య, డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌కి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏటూరు నాగారం మరో ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అలాగే జిల్లాలో ఆకస్మిక తనిఖీల్లో ఉన్న ఎస్పీ గౌష్ ఆలం ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: