Tirumala: తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదు: ఎస్పీ పరమేశ్వరరెడ్డి - తిరుపతి వార్తలు
22:40 May 01
తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్
Terrorists Rumors in Tirumala: తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం తిరుపతి పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగంతో కలిసి తిరుమలలోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేశారు. పోలీసుల తనిఖీలలో ఉగ్రవాద సమాచారం లేకపోవడంతో ఊపిరి పీల్చుకొన్నారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన మెయిల్ విషయమై తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్పందించారు. ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిందని తెలిపారు. మెయిల్‌తో అప్రమత్తమై తిరుమలలో పరిశీలించామని...తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదన్నారు. ఆకతాయి మెయిల్‌గా భావిస్తున్నామని.. మెయిల్ విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తిరుమలలో ఎలాంటి హైఅలర్ట్ ప్రకటించ లేదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: