తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు' - శ్రీనగర్​

అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదులను పట్టించిన వారికి బహుమతులు అందించనున్నట్లు జమ్ముకశ్మీర్​ పోలీసు విభాగం ప్రకటించింది. ఈ మేరకు తొమ్మిది మంది పేర్లను విడుదల చేసింది.

Police releases list of 9 wanted militants after spike in attacks
ఆ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు

By

Published : Mar 14, 2021, 11:13 AM IST

Updated : Mar 14, 2021, 11:52 AM IST

శ్రీనగర్ సహా ఇతర ప్రాంతాల్లో చురుకుగా పనిచేస్తున్న మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాదులను పట్టించిన వారికి రివార్డు ఇవ్వనున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని తమతో నేరుగా పంచుకోవచ్చని తెలిపారు.

వీరిలో ఆరుగురు 2020లోనే ఉగ్రవాదులుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురు గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు 9మంది పేర్లను విడుదల చేశారు.

పోలీసులు విడుదల చేసిన ఉగ్రవాదుల చిత్రాలు

వసీమ్ ఖాదీర్​, ఆదిల్​ ముస్తాక్​, ఇర్ఫాన్​ సోఫీ, సాకిబ్​ మన్​జూర్​, బిలాల్​ అహ్మద్​ భట్, ఉబేద్ షఫి, మొహమ్మద్​ అబ్బాస్​ షేక్, మొహమ్మద్ యూసుఫ్​ దార్​, అబ్రార్​ నదీమ్​ల సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోలీసుల ఫోన్​ నంబర్లు అందుబాటులో ఉంటాయని, వివరాలు తెలిస్తే తమకు ఇవ్వాలని సూచించారు.

ఇదీ చదవండి:ఉగ్రవాదం వైపు కశ్మీరీ యువత- ఆపేదెలా?

Last Updated : Mar 14, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details