తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం! - farmers tractor parade delhi

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని దిల్లీ పోలీసులు కోరారు. ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో నంగ్లోయిలోని రోడ్డుపై బైఠాయించారు. రైతులు ​ముందుకు సాగకుండా రోడ్డును దిగ్బంధించారు.

Police officials sit on road in Nangloi to block the area where farmers holding tractor parade have reached
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం

By

Published : Jan 26, 2021, 1:33 PM IST

Updated : Jan 26, 2021, 1:51 PM IST

ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతలు దారితీసిన వేళ.. రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని దిల్లీ పోలీసులు అభ్యర్థించారు. చట్టానికి చేతుల్లోకి తీసుకోద్దని కోరారు. బారికేడ్లు తొలగించి దిల్లీలోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకునేందుకు నంగ్లోయి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించకుండా రోడ్డును దిగ్భందించారు.

రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!
రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

మెట్రో స్టేషన్ల మూసివేత..

ర్యాలీ సమయంలో రైతులు-పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. 10కి పైగా మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​ వేదికగా ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడించారు.

రోడ్డుపై బైఠాయించి దిల్లీ పోలీసుల సత్యాగ్రహం!

ఇదీ చూడండి: ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్

Last Updated : Jan 26, 2021, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details