Police Officer Killed In Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లాలోని గంట్‌ముల్లాలో ఓ విశ్రాంత పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. విశ్రాంత అధికారిని మహ్మద్ షఫీగా అధికారులు గుర్తించారు. స్థానిక మసీదులో ప్రార్థన కోసం వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విశ్రాంత అధికారి "బారాముల్లాలోని గంట్‌ముల్లాలో విశ్రాంత పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థన కోసం స్థానిక మసీదుకు వచ్చారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో భద్రతా బలగాలు మోహరించాయి" అని కశ్మీర్ పోలీసులు ఎక్స్(అప్పటి ట్విట్టర్) వేదికగా తెలిపారు.
ఉగ్రవాదుల మెరుపు దాడి- అమరులైన ఐదుగురు జవాన్లు
మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజౌరీ-థనామండీ-సురన్కోటె మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
బుఫ్లియాజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో జవాన్లను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీ వాహనాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, ముష్కరులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోందని రక్షణ శాఖ పీఆర్ఓ కార్యాలయం తెలిపింది. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రీయ రైఫిల్స్-48 పరిధిలో ఈ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఆయుధాలతో ముష్కరులు పరార్?
'ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో బుధవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నాం. ఆ సమయంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. బలగాలు దీటుగా స్పందించాయి' అని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఉగ్రవాదులతో సైనికులు యుద్ధం కూడా చేశారని అధికార వర్గాల సమాచారం. దాడి తర్వాత ఉగ్రవాదులు ఆయుధాలతో పారిపోయారని తెలుస్తోంది. ఈ పూర్తి వార్తను చదివేందుకుఈ లింక్ పై క్లిక్చేయండి.
సరిహద్దుల్లో ఉద్రిక్తత- భారీ చొరబాట్లకు ఉగ్రమూకల యత్నం, తిప్పికొట్టిన ఆర్మీ
సరిహద్దులో 300 మంది ఉగ్రవాదులు- భారత్‌లోకి చొరబాటుకు రెడీ- బీఎస్ఎఫ్ అలర్ట్