Police Notice to Dastagiri House: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇంటికి పోలీసుల నోటీసు అంటించారు. దస్తగిరి భార్య షబానా పేరుతో పులివెందులలోని ఇంటికి 41-ఏ నోటీసు అంటించారు. అయితే ఆ నోటీసుపై తేదీ, సమయం లేదు. ఎస్‌ఐ హుస్సేన్ పేరుతో అంటించిన నోటీసులో పులివెందుల స్టేషన్‌లో నమోదైన కేసు విచారణకు రావాలని షబానాకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇంటికి పోలీసుల నోటీసు - ఏపీ లేటెస్ట్ న్యూస్
Published : Dec 22, 2023, 4:40 PM IST
|Updated : Dec 22, 2023, 7:08 PM IST
16:37 December 22
దస్తగిరి భార్య షబానా పేరుతో 41ఏ నోటీసు జారీ
అట్రాసిటీ కేసులో అరెస్టైన దస్తగిరి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కడప కోర్టు
నోటీసు ఇంటికి అతికించిన విషయం తెలుసుకున్న షబానా మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల అట్రాసిటీ కేసులో అరెస్టయి 50 రోజులుగా కడప జైల్లో ఉన్న భర్త కోసం పోరాడుతుంటే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని షబానా వాపోయారు. లేనిపోని కేసులు పెట్టి తనను కూడా జైలుకు పంపించేందుకు పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆమె పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టించేందుకు వైఎస్ మనోహర్ రెడ్డి కొందరికి డబ్బులు ఇచ్చి పురమాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.
"కడప జైల్లో ఉన్న నా భర్త కోసం నేను పోరాడుతుంటే పోలీసులు కేసు పెట్టి నన్ను వేధిస్తున్నారు. లేనిపోని కేసులు పెట్టి నన్ను కూడా జైలుకు పంపించేందుకు పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. తప్పుడు కేసులు పెట్టించేందుకు వైఎస్ మనోహర్ రెడ్డి కొందరికి డబ్బులు ఇచ్చి పురమాయిస్తున్నారు." - షబానా, దస్తగిరి భార్య
సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై విచారణ వాయిదా