కార్లలో బంగారం కంటే విలువైన లోహం ఉంటుందని మనలో చాలా మందికి తెలియకపోచచ్చు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఇంటెలిజెంట్ దొంగల ముఠాకు దీనిపై పూర్తి అవగాహన ఉంది. అందుకే పదుల సంఖ్యలో కార్లను అద్దెకు తీసుకుని వాటి సైలెన్సర్లరలో లభించే అత్యంత విలువైన రసాయన పదార్థాలను వెలికి తీస్తున్నారు. వీటితో తయారయ్యే లోహం 'పల్లేడియం'కు మార్కెట్లో బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతుంది.
ఈ దొంగల ఐడియా వేరే లెవెల్! వాహనాల్లో ఉపయోగించే హైడ్రోకార్బన్ కంబస్టషన్ ఫార్ములాతో రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది. సైలెన్సర్లలో దూళి రూపంలో ఏర్పడే దీనితో పసిడికంటే విలువైన పల్లేడియం తయారు చెయొచ్చు. ఈ విషయంపై పరిజ్ఞానం ఉన్న దొంగలు.. మారుతీ సుజుకీ ఎకో కార్లను అద్దెకు తీసుకొని వాటి సైలెన్సర్ల నుంచి విలువైన పదార్థాన్ని అపహరిస్తున్నారు.
ఈ దొంగల ఐడియా వేరే లెవెల్! విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.4 లక్షల విలువైన పల్లేడియం పదార్థాన్ని స్వాధీనం చేసుకుున్నారు. వీరంతా మహాసముంద్, రాయ్‌పుర్, భిలాయ్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు.
ఈ ముఠా ఇప్పటి వరకు 48 మారుతీ ఎకో కార్లను అద్దెకు తీసుకొని వాటి సైలెన్సర్ల నుంచి పల్లేడియం తీసి విక్రయించినట్లు పోలీసులు వివరించారు. నిందితుల నుంచి 20 కేజీల పొగదూళిని (పల్లేడియం తయారు చేసే పదార్థం) స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు, బైక్‌లు, 7 మొబైల్ ఫోన్లు, రూ.7వేల నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఇన్మార్ఫర్ ఇచ్చిన సమాచారంతో తాము ఈ ముఠా గుట్టు రట్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.