Police Lathi Charge in odisha: జేఎస్‌డబ్ల్యూ ప్రాజెక్టు కోసం తమలపాకు తోటలు తొలగిస్తుండగా.. అడ్డుకున్నారు గ్రామస్థులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనలో పాల్గొన్నవారిపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటన ఒడిశాలోని జగత్సింగ్పుర్ జిల్లా ధింకియా గ్రామంలో జరిగింది. పోలీసుల లాఠీఛార్జ్‌లో చాలా మంది మహిళలు, వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు.
ఏం జరిగింది..
జగత్సింగ్పుర్లోని ఎర్సామా బ్లాక్‌లో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం భూసేకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే పంటలను తొలగించే పనులు చేపట్టారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం లేకుండా, తమ డిమాండ్లను పరిష్కరించకుండా తోటల తొలగింపు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్థులు. పంటల తొలగింపు, నిర్మాణాల కూల్చివేతలు ఏకపక్షంగా ఉన్నాయని, ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలన్న పాలకవర్గ వ్యూహంలో ఇవన్నీ భాగమని ఆరోపించారు. ఆ పనులను అడ్డుకునేందుకు ప్లాంట్ నిర్మాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున ధింకియా గ్రామస్థులు చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వారిని నిలువరించే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు పోలీసులు.
నెల రోజుల క్రితం..