తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే! - Delhi Police launches 'Corona Rakshak' initiative

దేశంలోని పలు నగరాల్లో లాక్​డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఆంక్షలను బేఖాతరు చేస్తూ బయటకు వచ్చినవారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇలాంటి వారికి భోపాల్​లో కరోనా పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారికి దిల్లీలో గులాబీలు అందిస్తున్నారు.

LOCKDOWN INDIA
లాక్​డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే

By

Published : May 23, 2021, 12:40 PM IST

లాక్​డౌన్ సమయంలో బయటకు వచ్చినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు. బయట కనిపించినవారిని ర్యాండమ్​గా ఎంపిక చేసి నమూనాలను పరీక్షిస్తున్నారు.

పరీక్షల కోసం లైన్​లో ఉన్న వ్యక్తులు

అత్యవసర పని మీద బయటకు వచ్చే వారిని వదిలేస్తున్నట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. అనవసరంగా తిరిగేవారికే పరీక్షలు చేసి, వారి నుంచి జరిమానాలను సైతం వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

భోపాల్​లో వాహనదారులతో పోలీసులు
భోపాల్​లో కరోనా పరీక్షలు

ఇదీ చదవండి:కలెక్టర్ అత్యుత్సాహం- యువకుడి చెంప చెళ్లు!

సరైన ఈ-పాస్ ఉంటేనే రాష్ట్రానికి అనుమతిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు పోలీసులు.

తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ

పౌరులంతా స్వచ్ఛందంగా ఆంక్షలు పాటించేలా దిల్లీ పోలీసులు 'కరోనా రక్షక్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రోత్సహిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారికి గులాబీలు ఇస్తున్నారు.

గులాబీ అందిస్తున్న పోలీసులు
వాహన చోదకుడికి పుష్పాలు అందిస్తున్న పోలీసులు

కేరళలో లాక్​డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. రహదారిపై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి పంపిస్తున్నారు.

కేరళలో లాక్​డౌన్ ప్రభావం
కేరళలో పోలీసుల తనిఖీలు
కేరళ: వాహనదారుడిని ఆపిన పోలీసులు

లాక్​డౌన్​తో ఒడిశా రాజధాని భువనేశ్వర్​లోని రహదారులు బోసిపోయాయి. బయటకు వస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెడుతున్నారు.

ఒడిశాలో లాక్​డౌన్- నిర్మానుష్యంగా రహదారి
ఒడిశాలో..

కర్ణాటకలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది.

ఇదీ చదవండి:దిల్లీలో మే 31 వరకు లాక్​డౌన్ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details