తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందుత్వ నేతలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చిన పోలీసులు - పోలీసుల బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల పంపిణీ

పంజాబ్‌ పోలీసులు హిందుత్వ నాయకులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. సుధీర్‌ సూరి హత్య నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

police distribue bullet jacket Hindu leaders
హిందు నాయకులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు

By

Published : Nov 7, 2022, 5:56 PM IST

పంజాబ్‌లోని లుథియానాలో పలువురు హిందుత్వ నాయకులకు పోలీసులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల శివసేన పార్టీకి చెందిన సుధీర్‌ సూరిని దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడు. దీనిపై ప్రభుత్వం కల్పించే భద్రతపై విషయంలో పలు విమర్శలు వచ్చాయి. ఫలితంగా లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శివసేన నాయకుడు అమిత్‌ అరోరా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చినందుకు నాయకుల నుంచి డబ్బు వసూలు చేశారా, ఉచితంగా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details