wife beats husband in alwar: భర్తను భార్య గృహహింసకు గురిచేసిన ఘటన.. రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న అజిత్ యాదవ్‌ను, అతని భార్య చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డుకాగా ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతకుముందు భార్య బాధితుడు అజిత్ యాదవ్ అల్వార్ కోర్టును ఆశ్రయించాడు. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని, ఎలాంటి కారణం లేకుండా భార్య చితకబాదుతోందని అజిత్ న్యాయమూర్తి ముందు కన్నీటిపర్యంతమయ్యాడు.
భర్తను బ్యాట్‌తో చితకబాదిన భార్య.. వీడియో వైరల్.. కోర్టు మెట్లెక్కిన బాధితుడు
Wife beats Husband in Alwar: సాధారణంగా భార్యపై భర్త దాడి చేసిన ఘటనలను.. మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. కానీ రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భర్తపై ఓ మహిళ విచక్షణారహితంగా దాడిచేసింది. కన్నబిడ్డ ముందే క్రికెట్ బ్యాటుతో కొడుతూ పెనిమిటిని హడలెత్తించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా భార్య బారినుంచి రక్షించాలని బాధిత భర్త కోర్టును ఆశ్రయించాడు.
భార్య కొట్టే దెబ్బలు తాళలేకపోతున్నట్లు పేర్కొన్న అజిత్.. కోర్టు, పోలీసులే తనను కాపాడాలని అభ్యర్థించారు. భార్య తనను ఏవిధంగా హింసిస్తుందో చూడాలంటూ ఆమె కొడుతుండగా రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించాడు. బాధిత భర్త చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు అవసరమైతే భద్రత కూడా కల్పించాలని సూచించింది.
32ఏళ్ల అజిత్ యాదవ్‌కు ఏడేళ్లక్రితం సుమనాతో ప్రేమ వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది క్రితం వరకూ.. ఎంతో సంతోషంగా కాపురం చేస్తున్న వారి మధ్య అకస్మాత్తుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి భార్య తనను చిత్రవధకు గురిచేస్తోందని అజిత్ యాదవ్ కోర్టును ఆశ్రయించాడు.
ఇదీ చదవండి:జైల్లో సిద్ధూకు క్లర్క్ ఉద్యోగం.. జీతం ఎంతో తెలుసా?