బిహార్‌లోని పట్నా జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురు నేరస్థుల్లో ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ నేరస్థులు మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. చనిపోయిన నిందితులిద్దరూ సోదరులని.. పట్నా జైలు నుంచి తప్పించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుల ఎన్కౌంటర్.. ఇద్దరు మృతి - జైలు నుంచి తప్పించుకున్న నేరస్థులు
పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌లో జైలు నుంచి తప్పించుకున్న ఇద్దరు నేరస్థులు మరణించారు. చనిపోయిన ఇద్దరు సోదరులని.. జైలు నుంచి తప్పించుకుని యూపీలో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
![జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుల ఎన్కౌంటర్.. ఇద్దరు మృతి police encounter in varanasi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16992244-thumbnail-3x2-encounter.jpg)
బడగావ్ ప్రాంతంలో నవంబర్ 8వ తేదీనా వీరు ఒక పోలీసు అధికారిని గాయపరిచి సర్వీస్ పిస్టల్‌ను దొంగిలించారని వివరించారు. ఈ కేసులో విచారణ జరుగుతుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారాని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య కాల్పులు జరగ్గా.. నిందితులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో మరో నిందితుడు పారిపోయాడని వెల్లడించారు. బిహార్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ముగ్గురు నిందితులు కరుడుగట్టిన నేరస్థులని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు.