తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్తి కోసం అత్త, మామ హత్య.. కిల్లర్లను పిలిచి టెర్రస్​పై దాచి.. కోడలి పక్కా ప్లాన్​ - ఆస్తి కోసం అత్తమామ హత్య

ఆస్తి కోసం సొంత అత్తమామలనే హత్య చేసింది ఓ కోడలు. స్నేహితుడి సహాయంతో ఇద్దరి గొంతు కోసి చంపింది. ఈ ఘటన దిల్లీలోని గోకుల్​పురిలో జరిగింది.

Double Murder in delhi
Double Murder in delhi

By

Published : Apr 11, 2023, 2:36 PM IST

దిల్లీలోని గోకుల్​పురి ప్రాంతంలో ఆదివారం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం సొంత అత్తమామలను కోడలే హత్య చేసిందని గుర్తించారు. స్నేహితుడి సహాయంతో ఆమె ఇద్దరి గొంతు కోసి చంపిందని తేల్చారు. నిందితురాలు మోనికాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ జరిగింది
రాధేశ్యామ్​, ఆయన భార్య వీణ దిల్లీ గోకుల్​పురి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగీరథీ విహార్​లో నివసిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్​గా పని చేసి పదవీ విరమణ పొందారు. రాధేశ్యామ్​కు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు మోనికా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రాధేశ్యామ్​కు భాగీరథీ విహార్​లో రెండు అంతస్తుల భవనం, కొంత ఖాళీ స్థలం ఉంది. ఈ ఇంట్లోనే గత 38 ఏళ్లుగా ఉంటుంది రాధేశ్యామ్ కుటుంబం. అయితే, ఇంటి ముందు ఉన్న కొంత ఖాళీ స్థలాన్ని విక్రయించాలని అనుకున్నాడు రాధేశ్యామ్​. నివాసాన్ని అమ్మకానికి పెట్టగా.. ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకుని రూ. 5 లక్షలు అడ్వాన్స్​గా చెల్లించారు.

ఇంటి స్థలాన్ని అమ్మడం ఇష్టం లేని రాధేశ్యామ్​ కోడలు మోనికా.. వీరిపై కోపం పెంచుకుంది. ఇల్లు తన చేతిలో నుంచి పోతుందని భావించి.. వారిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం తన స్నేహితుడిని సాయం అడిగింది. ఇందుకోసం స్నేహితుడు సహా మరో వ్యక్తిని ఆదివారం రాత్రి ఇంటికి పిలిచి.. డాబాపైన దాచిపెట్టింది. రాత్రి అందరూ నిద్రపోయాక కిందికి పిలిచి అత్తమామలను హత్య చేసింది. అనంతరం ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని పారిపోయారు నిందితులు.

అత్త, మామను చంపిన తర్వాత కూడా మోనికా.. తనకేమీ తెలియనట్లుగా నటించింది. తన అత్తమామలను ఎవరో చంపారంటూ పోలీసుల ఎదుట కన్నీరు పెట్టుకుంది. రాత్రి 9 గంటలకు వారికి పాలు ఇచ్చి వచ్చానని.. ఇంతలోనే ఎవరో వచ్చి హత్య చేశారని రోదించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుటుంబ సభ్యుల అందరిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కోడలు మోనికా వ్యవహర శైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మోనికాను తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఆస్తి తన చేతిలో నుంచి పోతుందనే కోపంతోనే హత్య చేసినట్లు ఒప్పుకుంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ హత్యలో కుమారుడి ప్రమేయం లేదని పోలీసులు చెప్పారు. మరింత లోతుగా దరాప్తు చేపడుతామని తెలిపారు.

ఇవీ చదవండి :రూ.1.5 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్​.. ATMలో నింపేందుకు వచ్చి చోరీ..

గహ్లోత్​ X పైలట్​ పోరులో నిరాహార దీక్ష ట్విస్ట్.. హైకమాండ్ వార్నింగ్​ బేఖాతరు!

ABOUT THE AUTHOR

...view details