తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్ధరాత్రి హైడ్రామా.. సినీ ఫక్కీలో 2కి.మీ ఛేజింగ్​.. యువకుడ్ని కాపాడిన పోలీసులు

అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. కిడ్నాపర్ల నుంచి ఓ యువకుడ్ని సినీ ఫక్కీలో ఛేజింగ్​ చేసి కాపాడారు పోలీసులు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.

police rescued a youth in Bengaluru
police rescued a youth in Bengaluru

By

Published : Jan 12, 2023, 12:42 PM IST

సినీ ఫక్కీలో ఓ యువకుడిని కాపాడారు పోలీసులు. మూడు రోజుల క్రితం కిడ్నాప్​ అయిన యువకుడిని 'ఫాస్ట్ అండ్​ ఫ్యూరియస్​' సినిమాలో లాగా ఛేజ్​ చేసి రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే..తౌహీద్​ అనే యువకుడు మల్దివాలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం ఆ యవకుడ్ని కొందరు దుండగులు బందేపల్యా పోలీస్​ స్టేషన్​ పరిథిలో కిడ్నాప్​ చేశారు. అనంతరం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి బంధించారు. ఆ తర్వాత తౌహీద్​ కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి.. రూ. 60 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే తాము తౌహీద్​ను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిని అతడి తల్లి.. రూ.35 వేలు కిడ్నాపర్లకు ఇచ్చింది. అయినా ఆ దుండగులు తౌహీద్​ను విడిచిపెట్టలేదు. ఇలా లాభం లేదు అనుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు.. రాత్రి మల్దివాలా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. కోరమంగళ చెక్​పోస్టు వద్ద అడుగొడి స్టేషన్​లోని పోలీస్​ ఇన్​స్పెక్టర్ మంజునాథ్ రాత్రి​ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 11.40 సమయంలో వేగంగా దూసుకువస్తున్న హోండా సిటీ కారు.. బారికేడ్లను ఢీకొట్టింది. అందులో ఉన్న తౌహీద్​ 'సేవ్​.. సేవ్​.. సేవ్​..' అని అరిచాడు. దీంతో అది కిడ్నాప్​ అని గ్రహించిన ఇన్​స్పెక్టర్​... ఆ కార్​ను సినీ ఫక్కీలో ఛేజ్ చేశాడు. 2 కిలో మీటర్ల ఛేజ్​ అనంతరం కిడ్నాపర్ల కారును ఆపారు. దీంతో అందులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురు పారిపోయారు. గోపి అనే మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తౌహీద్​ను సురక్షితంగా కాపాడిన పోలీసులు.. అతడి కుటుంబసభ్యులకు అప్పిగించారు. కాగా, తౌహీద్​ వచ్చే వరకు మల్దివాలా పోలీస్​ స్టేషన్​లోనే ఉన్నారు అతడి కుటుంబ సభ్యులు.

ABOUT THE AUTHOR

...view details