తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వజ్రాలు చోరీ చేసి.. ఔషధాల్లో ప్యాక్​ చేసి..

వారం రోజుల క్రితం జరిగిన ఆభరణాల చోరీ కేసులో ఎనిమిది మందిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.55 లక్షల విలువైన ఆభరణాలతో పాటు.. ఐదు మేలిమి వజ్రాలు, మరో 250 డైమండ్లు స్వాధీనం చేసుకున్నారు.

Police arrests 8 robbers in MP, recovered 255 pieces of diamonds & cash Rs 55 lakh
భారీగా వజ్రాలు, డైమండ్​లు సీజ్​ చేసిన పోలీసులు

By

Published : Jun 6, 2021, 3:31 PM IST

మధ్యప్రదేశ్‌ బేతుల్‌లో వారం రోజుల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చింద్వాఢాకు చెందిన ప్రిన్స్ సోని (25) అనే వ్యక్తి ఈ చోరీలో ప్రధాన నిందితుడని ఎస్పీ సిమలా ప్రసాద్ తెలిపారు. సోని, అతని ముఠా మే 31న రూ.2.5 లక్షల నగదు, విలువైన ఐదు వజ్రాలను దోచుకున్నట్లు వెల్లడించారు.

దొరికారిలా..

సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఝార్ఖండ్​కు చెందిన కరణ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాక అతడిచ్చిన సమాచారం మేరకు.. సైఖేదా, పింటు నాగ్లే, శుభం గైక్వాడ్, పంకజ్ కావ్డే, హృతిక్ చంద్రహాస్, రోహిత్ మార్కంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రూ.55 లక్షలు విలువైన ఆభరణాలతో పాటు.. ఐదు మేలిమి వజ్రాలు, 250 డైమండ్లు, 2 నాటు తుపాకులు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వజ్రాలను ఔషధాలలో(క్యాప్సూల్స్‌) దాచి ఉంచారని ఎస్పీ వివరించారు.

ఇవీ చదవండి:'రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్​వేర్​, రూ.15 లక్షలు చోరీ'

చోరీ అవుతున్న వ్యక్తిగత సమాచారం!

ABOUT THE AUTHOR

...view details