తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్ వీడియో: సినీ ఫక్కీలో దొంగల అరెస్టు - చిక్కమగళూరు

ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తుల్ని సినీ ఫక్కీలో స్థానికుల సాయంతో అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటకలో చిక్క మంగళూరులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

Police arrested two thieves in cinematic manner with help of public
సినీ ఫక్కీలో దొంగల అరెస్టు

By

Published : Feb 28, 2021, 9:53 AM IST

సినీ ఫక్కీలో దొంగల అరెస్టు

కర్ణాటకలోని చిక్కమంగళూరులో సినీ ఫక్కీలో దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. స్థానికుల సాయంతో ఛేస్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు వ్యక్తులు.. సీడీఏ అధ్యక్షుడు చంద్రెగౌడ ఇంట్లో నగలు, డబ్బు దొంగిలించి పారిపోతుండగా స్థానికులు వారిని వెంబడించారు. వారిపై రాళ్లు విసిరారు. స్థానికులపై దాడి చేయడానికి నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో నిందితుల్ని అరెస్టు చేశారు.

నిందితులను సచిన్​, మోహన్​గా పోలీసులు గుర్తించారు. అందులో సచిన్​.. చంద్రెగౌడ బంధువని తెలిపారు.

"ఉదయం10 గంటలకే పని మీద బయటకి వెళ్లాను. వెంటనే నా ఇంట్లో దొంగలు పడ్డట్టు కాల్​ వచ్చింది. ఇంటికి వచ్చి చూసే సరికి దొంగతనం చేసి వెళ్లిపోయారు. అయితే ఆ దొంగలు చాలా పేదవారని స్థానికులు అన్నారు. ఆ దొంగలు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు."

-చంద్రెగౌడ, బాధితుడు

చంద్రెగౌడకు, సచిన్​కు ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని ఈ క్రమంలోనే ప్రతీకారంతో దొంగతనం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం- కాపాడిన పోలీసు

ABOUT THE AUTHOR

...view details