Delhi Drugs: దేశ రాజధాని దిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60 కోట్లు విలువైన 15.05 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన ముఠాలు ఈ హెరాయిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నాయి.
మళ్లీ డ్రగ్స్ కలకలం.. రూ.60కోట్ల సరకు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్ - దిల్లీ డ్రగ్స్ న్యూస్
Delhi Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు. వీరి నుంచి రూ.60 కోట్ల విలువైన 15.05 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో అసోంలో నల్లమందును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిల్లిలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం... రెండు ముఠాల అరెస్ట్..
అస్సోం కార్బి ఆంగ్లోంగ్ జిల్లాలో నల్లమందును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 45 కిలోల ఓపియంను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బోర్పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిని పట్టుకున్నామని.. నిందితులను రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:మెడికోతో లవ్ ఫెయిల్.. కక్షతో ల్యాప్టాప్స్ చోరీ.. ప్రతి కాలేజీకి టైమ్‌టేబుల్ వేసి మరీ...
Last Updated : Apr 11, 2022, 6:01 PM IST