జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లాలో 14ఏళ్ల ఉగ్రవాదిని అరెస్టు చేశారు పోలీసులు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు.. ఓ ఉగ్రసంస్థలో చేరినట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్లో 14ఏళ్ల ఉగ్రవాది అరెస్ట్! - 14 year old militant arrest in Jammu and Kashmir
జమ్ముకశ్మీర్లో 14ఏళ్ల మిలిటెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు ఓ ఉగ్రసంస్థలో చేరినట్లు గుర్తించిన అధికారులు.. అతడిని అరెస్టు చేశారు.

కశ్మీర్లో 14ఏళ్ల ముష్కరుడి అరెస్ట్!
అతడిని.. బందిపొరా జిల్లాలోని పంజిగామ్కు చెందిన బాలుడిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదీ చూడండి:సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?