poisonous liquor Uttarakhand : కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఫుల్‌గఢ్, శివగఢ్ గ్రామాల్లో శనివారం జరిగింది.
ఫుల్‌గఢ్ గ్రామానికి చెందిన రాజు, భోలా అనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడు మనోజ్.. శివగఢ్కు చెందినవాడు. జాలీ గ్రాంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించగా.. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. హరిద్వార్‌లో పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడం వల్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ప్రజలకు మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
కల్తీ మద్యానికి ఐదుగురు బలి.. ఆ ఎన్నికలే కారణమట!
కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది.
కల్తీ మద్యం