తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 300 మందికి అస్వస్థత - పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ 300 మంది

Food Poisoning: ఓ వివాహ వేడుకలో విందు ఆరగించిన 300 మందికిపైగా అతిథులు అనారోగ్యం బారినపడ్డారు. వెంటనే వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Food Poisoning:
ఆసుపత్రిలో బాధితులు

By

Published : May 23, 2022, 5:02 PM IST

Food Poisoning: మహారాష్ట్ర లాతూర్​ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై భోజనం చేసిన 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. నీలంగ తాలూకాలోని కేదార్‌పుర్ సమీపంలోని కేదల్జవల్గా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఆసుపత్రిలో బాధితులు

ఇదీ జరిగింది.. కేదల్జవల్గా గ్రామంలో జరిగిన ఓ వివాహానికి సుమారు 300కు పైగా అతిథులు హాజరయ్యారు. పెళ్లి భోజనం చేసిన అనంతరం వీరంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇంటికి వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో నీరసపడిపోయారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం చాలా మంది కోలుకున్నారు. మరికొంత మందికి వైద్యం అందిస్తున్నారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెళ్లిలో తిన్న ఆహారం వల్లే అస్వస్థతకు గురయ్యామని బాధితులు చెబుతున్నారు. అయితే 300 మంది అస్వస్థతకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details