తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉచిత వ్యాక్సినేషన్‌పై సీఎంల హర్షం

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. టీకా సేకరణకు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రకటన ఉపశమనాన్ని ఇచ్చిందని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.

vijayan, vaccination
విజయన్​ , టీకా

By

Published : Jun 7, 2021, 9:09 PM IST

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ప్రకటనను పలు రాష్ట్రాలు స్వాగతించాయి. ఉచిత వ్యాక్సినేషన్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్రాల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉచిత వ్యాక్సినేషన్, దీపావళి వరకు రేషన్ ఇవ్వడం హర్షనీయమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నిర్ణయం సాయం చేస్తున్నారు.

పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ సైతం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌, గోవా, హరియాణా రాష్ట్రాల సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్, ఎంఎల్​ ఖట్టర్‌లు మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నిర్ణయం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడకుండా ఉంటుందని ఖట్టర్ అన్నారు. అందరికీ టీకాలతో మూడో దశ వ్యాప్తిని ఎదుర్కోగలమని పేర్కొన్నారు.

ప్రధాని ప్రకటన కొత్త బలాన్నిస్తుంది ..

వయోజనులందరికీ కరోనా టీకా ఉచితంగా అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రధాని నిర్ణయం కొత్త బలాన్ని చేకూర్చిందని అన్నారు. అంతేగాక దేశ ప్రజలకు ఈ వార్త ఉపశమనం కలిగించిందన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

సంక్షోభ సమయంలో మోదీనే నాయకుడు..

అందరికీ ఉచిత టీకా, పేదలకు రేషన్ అందిస్తామని ప్రధాని చేసిన ప్రకటన చేయడంపై భాజపా నేతలు మోదీకి అభినందనలు తెలిపారు. సంక్షోభం సమయంలో మోదీ నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తారని నేతలు కొనియాడారు.

ఇదీ చూడండి:మోదీ ప్రసంగం- టాప్​ టెన్​ హైలైట్స్​

ABOUT THE AUTHOR

...view details