కొవిడ్ టీకా వేయించుకున్నందుకు గానూ లబ్ధిదారులకు అందించే ధ్రువ పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. పోలింగ్ జరిగే రాష్ట్రాలకు మాత్రమే మోదీ ఫొటో లేని సర్టిఫికేట్లను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ నెల 9న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీ ఆదేశాల మేరకే తగు చర్యలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు.
కొవిడ్ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగింపు-కారణం ఇదే! - letter to the Election Commission from Union Health Secretary Rajesh Bhushan
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరోనా టీకా తీసుకున్న తరువాత ఇచ్చే ధ్రువపత్రంపై మోదీ ఫొటోని తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఇలా చేసినట్లు పేర్కొంది.
కొవిడ్ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగింపు..కారణం ఇదే!
అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్లతో పాటు పుదుచ్చేరికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా సంబంధిత రాష్ట్రాల్లో అవసరమైన మేరకు ఫిల్టర్లు తొలగించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని ఈసీ సూచించింది. ధ్రువపత్రాల్లో ప్రధానమంత్రి ఫొటోను ఈసీ ఆదేశించింది.