దేశానికే వెన్నెముక అయిన రైతుపై దాడికి పాల్పడుతూ మోదీ ప్రభుత్వం భారత్‌ను బలహీన పరుస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలన వల్ల అంసాంఘిక శక్తులే బలపడుతున్నాయని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
" మన రైతులు, కార్మికులపై దాడికి పాల్పడుతూ దేశాన్ని ప్రధాని మోదీ బలహీన పరుస్తున్నారు. మోదీ పాలనలో దేశంలోని అసాంఘిక శక్తులే లాభపడుతున్నాయి.
---రాహుల్ గాంధీ, ,కాంగ్రెస్ అగ్రనేత
'కేంద్ర హోం మంత్రి స్పందించాలి'
ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వారిని ఎందుకు అడ్డుకోలేదన్నారు. విద్రోహ శక్తులను ఎర్రకోట పరిసరాల్లోకి పంపటంపై హోం మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రైతులతో చర్చలు జరిపాలన్నారు రాహుల్. సమస్యకు సరైన పరిష్కారం.. చట్టాలను రద్దు చేయటమేనని స్పష్టం చేశారు. అన్నదాతలు ఇంటికి వెళ్తారని కేంద్రం అనుకోవద్దన్నారు. సమస్యను పెద్దది చేయటం తమ అభిమతం కాదని.. పరిష్కారమే తమకు కావాలన్నారు.