ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఇద్దరు స్నేహితులకు మొత్తం దేశ వ్యవసాయరంగాన్ని అప్పగించాలనుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. రాజస్థాన్లోని రూపాన్గఢ్లో రైతులతో రాహుల్ సమావేశమయ్యారు.
"వ్యవసాయ రంగం అంటే.. రైతులు, చిన్న మధ్యతరహా వ్యాపారులు, కూలీలు, వంటి 40 శాతం మంది వ్యాపారం ఇది. ఈ మొత్తం వ్యాపారాన్ని నరేంద్ర మోదీ తన ఇద్దరు స్నేహితులకు అప్పగించాలని చూస్తున్నారు. అందుకే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చారు. ప్రజలకు మోదీ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు.. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు. "