తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకాపై శనివారం మోదీ కీలక ప్రకటన!

హైదరాబాద్​, పుణె, గుజరాత్​లో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. కరోనా వ్యాక్సిన్​ పరిశోధనలను స్వయంగా సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో టీకాపై మోదీ ఏమైనా కీలక ప్రకటన చేస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

PM to visit Serum Institute of India in Pune on Nov 28
శనివారం 'సీరం'కు మోదీ- టీకాపై సమీక్ష

By

Published : Nov 26, 2020, 3:10 PM IST

Updated : Nov 26, 2020, 5:53 PM IST

కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తి, సరఫరాపై కేంద్రం కసరత్తు చేస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాక్సిన్​ పరిశోధనలను శనివారం స్వయంగా సమీక్షించనున్నారు. టీకా అభివృద్ధిలో ముందున్న భారత్​ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టీకా​పై మోదీ కీలక ప్రకటన చేస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

హైదరాబాద్​...

శనివారం.. ప్రధాని తొలుత హైదరాబాద్​లోని హకీంపెట విమానాశ్రయం చేరుకోనున్నారు. భారత్​ బయోటెక్​ సంస్థను సందర్శించి 'కొవాగ్జిన్​' టీకాపై సమీక్షించనున్నారు.

పుణె...

హైదరాబాద్​ నుంచి మోదీ మహారాష్ట్ర పుణెకు వెళ్లనున్నారు. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(సీఐఐ)ను ప్రధాని సందర్శించనున్నారు.

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకాను భారత్​లో పంపిణీ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్​ఐఐ. టీకా పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ప్రధాని ప్రత్యక్షంగా సీరం ఇన్​స్టిట్యూట్​ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కరోనా వ్యాక్సిన్​ ప్రక్రియ ఏ దశలో ఉందనే అంశాన్ని ప్రధాని సమీక్షించే అవకాశమున్నట్టు సమాచారం. టీకా ఆవిష్కరణ, ఉత్పత్తి, సరఫరా పద్ధతులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు మోదీ.

గుజరాత్​...

పుణె నుంచి మోదీ గుజరాత్​కు వెళ్లే అవకాశముంది. అక్కడ ఉన్న జైడస్​ క్యాడిలా ప్లాంట్​ను మోదీ సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

జైడస్​ రూపొందిస్తున్న 'జైకొవ్​-డీ' వ్యాక్సిన్​ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో టీకాపై ప్రధాని ఇక్కడే ఓ కీలక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.

ఇదీ చూడండి:-డిసెంబర్​ కల్లా 10 కోట్ల వ్యాక్సిన్​ డోసులు

Last Updated : Nov 26, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details