ఫార్మా సంస్థల ప్రతినిధులతో మోదీ భేటీ
దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఔషధాల ఉత్పత్తి, సరఫరా, టీకాలు వంటి కీలక విషయాలపై చర్చించారు.
19:07 April 19
ఫార్మా సంస్థల ప్రతినిధులతో మోదీ భేటీ
దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఔషధాల ఉత్పత్తి, సరఫరా, టీకాలు వంటి కీలక విషయాలపై చర్చించారు.
18:31 April 19
ప్రముఖ వైద్యులతో ప్రధాని మోదీ భేటీ
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ వైద్యులతో వర్చువల్గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రస్తుత పరిస్థితులు, చికిత్సలపై సమీక్షించారు. సమాజ రక్షణలో వైద్యుల పాత్ర, ప్రభావాన్ని నొక్కి చెప్పారు. కొవిడ్ చికత్సలో అనుభజ్ఞులైన వైద్యులు నగరాల నుంచి వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాలకు వెళ్లి చికిత్స అందించాలని కోరారు. కరోనా పోరులో వ్యాక్సినేషన్ అనేది అతిపెద్ద పోరాటంగా చెప్పారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కొవిడ్-19 పై అసత్యాల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కరోనా మినహా ఇతర చికిత్సల కోసం టెలి మెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర మంత్రి మన్షుక్ మాండవియా హాజరయ్యారు.
15:14 April 19
ఫార్మా సంస్థలు, ప్రముఖ వైద్యులతో మోదీ భేటీ
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, ఫార్మా సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
వైద్య నిపుణులతో జరిగే సమావేశం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.
అంతకుముందు ఉదయం 11.30 గంటలకు కొవిడ్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు మోదీ. దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఆక్సిజన్, రెమ్డెసివిర్ లాంటి ఔషధాల కొరత ఉందంటూ.. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విన్నవిస్తున్న క్రమంలో జరుగుతున్న వరుస సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.