ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో నేడు (మంగళవారం) ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం ప్రారంభించనున్నారు మోదీ. ఈ కార్యక్రమానికి మహోబా జిల్లా నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ఓ అధికారి తెలిపారు.
అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం కోసం తీసుకొచ్చిందే ఉజ్వల. ఈ కార్యక్రమంలో ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని, అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.