దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్'ను(పీఎండీహెచ్ఎం)(Pm Digital Health Mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi News) నేడు ప్రారంభించనున్నారు. వర్చువల్గా ఆయన ఈ కార్యక్రమంలో(Pm Digital Health Mission) పాల్గొనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
"సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... 'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్'ను ప్రారంభిస్తారు. వర్చువల్గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన ప్రసంగిస్తారు.
-ప్రధానమంత్రి కార్యాలయం
ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే.. పైలట్ ప్రాజెక్టుగా పీఎండీహెచ్ఎం(Pm Digital Health Mission) అమలవుతోందని పీఎంఓ తన ప్రకటనలో పేర్కొంది. అయితే... ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. పీఎండీహెచ్ఎంను ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా కూడా హాజరవుతారని తెలిపింది.
ఏంటీ ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్?
- టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
- దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయిస్తారు.
- హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
హెల్త్ ఐడీ అంటే?
- ప్రతి ఒక్కరికీ ఆధార్ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్ ఐడీ.
- ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
- వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
- ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.