దేశంలో కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు రాష్ట్రాలు, జిల్లాల క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై సాగిస్తున్న పోరుకు సంబంధించి ఆయా అధికారులు వారి అనుభవాలు, సూచనలు, సిఫార్సులు ప్రధానికి చెప్పనున్నారు.
ఈ సమీక్షలో.. కొవిడ్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించిన అధికారులు తమ ప్రణాళికలను పంచుకోనున్నట్లు ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.