తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.83 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారం - గుజరాత్​ గిర్​ సోమనాథ్ జిల్లా వార్తలు

గుజరాత్​లోని ప్రసిద్ధ సోమనాథ్​ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేడు వర్చువల్​గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.30 కోట్లతో నిర్మిస్తున్న పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

pm modi
ప్రధాని మోదీ

By

Published : Aug 20, 2021, 5:08 AM IST

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్​ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొనున్నారు.

శ్రీ సోమనాథ్​ ట్రస్ట్​(ఎస్​ఎస్​టీ) ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ.. మూడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని ఎస్​ఎస్​టీ ట్రస్టీ, కార్యదర్శి పీకే లహరీ తెలిపారు. ప్రధాన ఆలయం వద్ద రూ.30 కోట్లతో నిర్మిస్తున్న పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. రామ మందిర్​ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

సోమనాథ్​ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్​ పొడవైన 'సముద్ర దర్శనం' నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారని లహరీ చెప్పారు. కొత్తగా నిర్మించిన ఓ మ్యూజియాన్నీ ప్రారంభిస్తారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details