ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్లోని కేవడియాలో జరగుతున్న ఉన్నత స్ధాయి సైనిక అధికారుల మేథోమథన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా జవాన్లు, జూనియర్ కమిషన్డ్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. త్రివిధ దళాల్లో వివిధ స్థాయికి చెందిన 30 మంది అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు.
నేడు సైనిక అధికారుల సదస్సులో మోదీ ప్రసంగం - ప్రధాని మోదీ న్యూస్
కేవడియాలో జరుగుతున్న ఉన్నత స్థాయి సైనిక అధికారుల సదస్సు ముగింపులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. త్రివిధ దళాల అధిపతులు, వివిధ స్థాయికి చెందిన 30 మంది అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. దేశ భద్రతా పరిస్థితి, త్రివిధ దళాల సన్నద్ధతను ఈ సదస్సులో మోదీ సమీక్షిస్తారు.
నేడు సైనిక అధికారుల సదస్సులో మోదీ ప్రసంగం
దేశ భద్రతా పరిస్థితి, త్రివిధ దళాల సన్నద్ధతను ఈ సదస్సులో మోదీ సమీక్షిస్తారు. తీవ్ర ఉద్రిక్తతల అనంతరం భారత్, చైనా బలగాల ఉపసంహరణ చేపట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గురువారం ప్రారంభమైన ఈ సదస్సు నేటితో ముగుస్తుంది. త్రివిధ దళాల అధిపతులు ఇందులో పాల్గొంటున్నారు.