తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశాభివృద్ధిని అడ్డుకోవటమే విపక్షాల లక్ష్యం'

ఆర్టికల్​ 370 రద్దు చేసి రెండేళ్ల పూర్తయిన సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆగస్టు 5 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏడాది క్రితం ఇదే రోజున అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు పడిందన్నారు. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన లబ్ధిదారులతో మాట్లాడారు. పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలపై విమర్శలు గుప్పించారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Aug 5, 2021, 3:08 PM IST

ఆగస్టు 5వ తేదీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్టికల్​ 370 రద్దు, రామ మందిర నిర్మాణానికి తొలి అడుగు ఇదే రోజు పడినట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన.. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు మోదీ. కొవిడ్​-19 వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, పుకార్లను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల్లో పేదలకు అందే ఆహార ధాన్యాలు దోపిడికి గురయ్యాయన్నారు.

పెగసస్​ వ్యవహారంపై పార్లమెంట్​ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ. అభివృద్ధి పథంలో నడవకుండా దేశాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవటమే విపక్షాల లక్ష్యమని ధ్వజమెత్తారు. వారి చర్య దేశవ్యతిరేకమన్నారు. దేశం ఓవైపు గోల్​పై గోల్​ చేస్తుంటే, కొందరు సొంత రాజకీయ ఎజెండా కోసం సెల్ఫ్​ గోల్​ చేసుకుంటున్నారని విమర్శించారు.

"చరిత్రలో ఆగస్టు 5 గుర్తుండిపోతుంది. రెండేళ్ల క్రితం ఇదే రోజున ఆర్టికల్​ 370 రద్దయింది. గత ఏడాది ఈ రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఈరోజు రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొంత మంది (ప్రతిపక్షాలు) పార్లమెంట్​ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి, దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. అలాంటి రాజకీయాలకు, స్వార్థానికి దేశం బందీ కాదు. సరికొత్త భారత్​ ర్యాంకుల ద్వారా కాకుండా మెడల్స్​ సాధించటం వల్ల ప్రపంచ గుర్తింపు పొందుతోంది. అది కుటుంబంతో కాదు, కష్టపడినప్పుడే రుజువుతుంది. భారతీయ యువత లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కొన్నేళ్ల క్రితం.. ఉత్తర్​ప్రదేశ్​ను రాజకీయ కోణంలోనే చూశారని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశాల గురించి ఆలోచించలేదని ఆరోపించారు మోదీ. కానీ, కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధి ఇంజిన్​ పుంజుకుందన్నారు.

ఇదీ చూడండి:'ఆ వార్తలు నిజమైతే.. 'పెగసస్​'ను తీవ్రంగా పరిగణిస్తాం'

ABOUT THE AUTHOR

...view details