తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాన్నతో కలిసి విమానం ఎక్కి- మోదీకి థాంక్స్​ చెప్పి - మోదీ న్యూస్ టుడే

తన తండ్రితో కలిసి విమానం ఎక్కిన ఓ బిహార్ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్యూ చెబుతూ ట్వీట్​ చేశాడు. ఆ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు మోదీ.

modi, PM modi
మోదీ, ప్రధాని మోదీ

By

Published : Jul 24, 2021, 6:03 AM IST

వివిధ ప్రాంతాలను కలపడానికి, ప్రజలకు విమాన ప్రయాణం సులభతరం చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఓ వ్యక్తి ట్విట్టర్​లో చేసిన పోస్ట్​కు ఈ విధంగా జవాబిచ్చారు మోదీ.

మీ వల్లే మోదీజీ...

బిహార్​ దర్భంగా విమానాశ్రయంలో ముకుంద్ ఝా అనే వ్యక్తి తన తండ్రితో విమానం ఎక్కాడు. మొదటిసారి విమానం ఎక్కినందుకుగాను ప్రధాని మోదీకి ధన్యావాదాలు తెలుపుతూ ట్విట్టర్​లో మోదీ ఫొటో పోస్ట్ చేశాడు.

"జీవితంలో మొదటిసారి నాన్నతో కలిసి విమానం ఎక్కా. దర్భంగాలో విమానాశ్రయం ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 2014 ఎన్నికల సమయంలో విమానాశ్రయం కట్టిస్తామని భాజపా మాటిచ్చింది. ఆ మాటను నిలబెట్టుకుంది."

--ముకుంద్ ఝా, ట్వీట్.

దీనికి రిప్లై ఇచ్చిన మోదీ.. ప్రజలకు విమాన ప్రయాణాలు సులభతరం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై కలిసి పోరాడాలి'

ABOUT THE AUTHOR

...view details