సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించాలని ప్రధాని కోరారు. సౌదీ పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థ అనేక అవకాశాలను ఇస్తోందని తెలిపారు.
2019 లో స్థాపించబడిన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పనితీరును ఇరువురు నాయకులు సమీక్షించారు. భారత్-సౌదీ భాగస్వామ్యంలో స్థిరమైన వృద్ధి సాధించడంపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.