తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉద్యోగాలకు రేట్ కార్డులతో లూటీ'.. గత ప్రభుత్వాలపై నరేంద్ర మోదీ ఫైర్ - modi comments on congress party

PM Rojgar Mela 2023 June : 'రోజ్‌గార్ మేళా' భాజపా, ఎన్​డీఏ ప్రభుత్వాలకు కొత్త గుర్తింపుగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాలు యువతను మోసం చేశాయని మండిపడ్డారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 70 వేల మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

pm rojgar mela 2023 june
ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 2023 జూన్​

By

Published : Jun 13, 2023, 2:11 PM IST

Rojgar Mela Pm Modi 2023 : నియామక ప్రక్రియలో అవినీతి, బంధుప్రీతిని ప్రోత్సహిస్తూ.. కుటుంబ పార్టీలు యువతకు ద్రోహం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 'రేటు కార్డ్'​లతో యువత ఉద్యోగాలను దోచుకున్నాయని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం యువత భవిష్యత్​కు రక్షణగా నిలిచిందన్నారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న వారికి.. దాదాపు 70 వేల మందికి మంగళవారం నియామక పత్రాలు అందచేసిన మోదీ.. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు.

దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్​సీ, ఆర్‌ఆర్‌బీ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. పరీక్ష ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా చేయడమే ఈ సంస్థల ధ్యేయం. ఇంతకుముందు నియామక ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టేది. ఒకవేళ ఈ నియామకాల వివాదం కోర్టుకు వెళితే.. వివాదం ముగిసేసరికి మరో రెండు లేదా 5 ఏళ్లు వృథా అయ్యేవి. వీటన్నింటి నుంచి ఇప్పుడు బయటపడ్డాం. కొద్ది నెలల్లోనే నియామకాల ప్రక్రియ మొత్తం ఎంతో పారదర్శకంగా పూర్తి అవుతోంది.

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

"కుటుంబ రాజకీయ పార్టీలు అన్ని వ్యవస్థల్లో బంధుప్రీతి, అవినీతిని ప్రోత్సహించాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లోనూ.. అవి ఈ విధానాన్ని పాటించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం నియామక ప్రకియను.. తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టింది. బంధుప్రీతికి ముగింపు పలికింది." అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ పేరు చెప్పకుండానే ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన.. కుటుంబ రాజకీయ పార్టీలు కోట్ల మంది యువతను మోసం చేశాయని మండిపడ్డారు.

ప్రస్తుతం భారత్​ స్థిరంగా ఉందన్న మోదీ.. దశాబ్దం క్రితం కంటే బలంగా, సురక్షితంగా.. దేశం ఉందని నొక్కిచెప్పారు. నిర్ణయాత్మకత.. భారత ప్రభుత్వానికి గుర్తింపుగా మారిందన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చయని చెప్పారు. ముద్రా యోజన, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాల కారణంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా యువతకు కలిగాయని మోదీ వివరించారు.

"గతంలో మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంత విశ్వాసం లేదు. ఒకపక్క కరోనా మహమ్మారి, మరోపక్క ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా.. మన దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. అయినప్పటికి ఈ సవాళ్లు అన్నింటినీ.. భారత్ అధిగమించి కొత్త శిఖరాలను అందుకుంది. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలోని ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి." అని మోదీ అన్నారు. 'రోజ్​గార్​ మేళా' బీజేపీ, ఎన్​డీఎ ప్రభుత్వాలకు కొత్త గుర్తింపునిస్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details