దేశంలోని 12 రాష్ట్రాల్లో.. రూ.44,545 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. దిల్లీలో నిర్వహించిన 36వ 'ప్రగతి' సమావేశ కార్యక్రమానికి మోదీ అధ్యక్షత వహించారు. ఎనిమిది మెగా ప్రాజెక్టులు సహా.. ఒక పథకానికి సంబంధించిన ఫిర్యాదు, ఎజెండాలోని 10 అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి ప్రాజెక్టుల వేగాన్ని పెంచాల్సిందిగా అధికారులకు సూచించారు.
యుద్ధప్రాతిపదికన..
వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అమలు ఆలస్యంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల అమలులో అడ్డంకిగా ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనకు(పీఎంజీఎస్వై) సంబంధించిన ఫిర్యాదులపై ప్రధాని సమీక్ష చేపట్టారు. ఈ పథకం కింద నిర్మిస్తున్న రహదారుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ రాష్ట్రాల్లో..