ఇస్కాన్ వ్యవస్థాపకులు 'శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద'(ISKCON founder) 125వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రూ.125 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన(Srila Bhaktivedanta Swami Prabhupada)కు నివాళులు అర్పించారు. నిజమైన విశ్వాసానికి ఇస్కాన్ అసలైన నిర్వచనం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు.
"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు(iskcon temples) ఉన్నాయి. ఇవన్నీ భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. విశ్వాసం అంటే.. ఉత్సాహం, మానవత్వం మీద నమ్మకం అనే అర్థాన్ని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపజేస్తున్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలోనూ ఇస్కాన్ చేసే సేవలు అనిర్వచనీయం. 2001లో కచ్‌లో భూకంపం వచ్చినప్పుడు.. ఇస్కాన్ ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేసిన విషయం నాకింకా గుర్తు. దేశం ఎప్పుడు ప్రకృతి విపత్తులకు గురైనా.. ఇస్కాన్ సాయానికి ముందుకొచ్చింది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రపంచానికి భారత్ ఎంతో పరిజ్ఞానాన్ని అందించిందని మోదీ(PM Modi) పేర్కొన్నారు. యోగా ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. భారత్‌లో ప్రజలు పాటించే జీవన విధానంతో పాటు ఆయుర్వేదం వంటి శాస్త్రాల నుంచి ప్రపంచం చాలా ప్రయోజనం పొందవచ్చని అన్నారు.