సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్ జయంతి(ప్రకాష్ పూరవ్) సందర్భంగా.. రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి బుధవారం నివాళులర్పించారు. గురు గోవింద్ సింగ్ జీవితం.. మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ పేర్కొన్నారు. సమానత్వం, సమగ్రతను ఆయన జీవితం ప్రతిబింబిస్తుందన్నారు.
10వ సిక్కు గురువు గోవింద్ సింగ్ జీవితం సంఘటిత సమాజాన్ని సృష్టించడానికి తోడ్పడిందని ప్రధాని మోదీ కొనియాడారు. సమగ్ర సమాజాన్ని సృష్టించడానికి ఆయన అంకితభావంతో కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు.