దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్‌ను(పీఎం-డీహెచ్ఎం)(digital health mission) ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news latest) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్‌తో(హెల్త్ ఐడీ)(digital health mission in India) వైద్య కార్డు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
ఏంటీ ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్?
- టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
- దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయిస్తారు.
- హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
హెల్త్ ఐడీ అంటే?
- ప్రతి ఒక్కరికీ ఆధార్ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్ ఐడీ.
- ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
- వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
- ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.
ఏ సమాచారం నిక్షిప్తమవుతుంది?
- మనం చేయించుకున్న వైద్య పరీక్షల వివరాలు.
- ఇదివరకు వైద్యులు సూచించిన మందులు.
- గతంలో ఏం చికిత్స తీసుకున్నారనే విషయాలు.
- ఆ వ్యక్తికి వర్తించే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా వివరాలూ ఉండే అవకాశం.
ఉపయోగాలు ఏంటి?
- దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
- మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్, ఈ- ఫార్మసీలు సేవలు అందుతాయి.
- ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది.