తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PM Narendra Modi Telangana Tour : ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెలలో తెలంగాణకు ప్రధాని మోదీ

PM Modi Visits Telangana on This Month : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటలు ఖరారు కాగా... ప్రధాని మోదీ సైతం మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల్లోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.

PM Narendra Modi
PM Narendra Modi

By

Published : Jun 6, 2023, 3:44 PM IST

PM Narendra Modi Hyderabad Tour : రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ.. కేసీఆర్​ను ఎలాగైనా ఈ సారి గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. దాంట్లో భాగంగానే.. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా మహా జన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్రనేతలు వరుసగా పర్యటించనున్నారు.

PM Modi Road Show in hyderabad on June : ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటలు ఖరారు కాగా.... త్వరలోనే ప్రధాని మోదీ సైతం రాష్ట్రానికి రానున్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా ఈ నెలలో మల్కాజిగిరి పార్లమెంట్ లో నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు. కర్ణాటక తరహాలో హైదరాబాద్​లో మోదీ రోడ్ షో ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మోదీ రోడ్ షోతో పాటు సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పాయి. రేపు లేదా ఎల్లుండి పర్యటన తేదీతో పాటు బహిరంగ నిర్వహించే పార్లమెంట్ ఖరారుకానున్నట్లు తెలిపాయి.

Amit Shah and JP Nadda Telangana Tour Update : మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో జేపీ నడ్డా, అమిత్‌ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జరిగే సభకు అమిత్ షా హాజరవుతారు. అలాగే... 25న నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మహాజన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా తెలంగాణలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ సమీక్ష నిర్వహించారు. జూన్ 30వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సాహసోపేత నిర్ణయాలు, పథకాలను ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details