తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యం అంటే 'విధానం' మాత్రమే కాదు.. అది భారత్ స్వభావం' - భారత పార్లమెంటరీ వ్యవస్థ

ప్రజాస్వామ్యం అనేది ఒక విధానం మాత్రమే కాదని.. అది భారతదేశ స్వభావమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సిమ్లాలో జరుగుతున్న అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 82వ కాన్ఫరెన్స్​ను ఆయన వర్చువల్​గా ప్రారంభించి.. ప్రసంగించారు.

PM Narendra Modi speech
మోదీ

By

Published : Nov 17, 2021, 11:36 AM IST

Updated : Nov 17, 2021, 11:58 AM IST

భారతదేశానికి ప్రజాస్వామ్యం అనేది ఒక విధానం మాత్రమే కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. డెమొక్రసీ అనేది భారతదేశ సహజ స్వభావమని తెలిపారు. సిమ్లాలో 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసాధారణ లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

"నేడు భారతదేశం 110 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. ఒకప్పుడు ఇది అసాధ్యం అనిపించింది. ఇప్పుడు సాధ్యం చేసి చూపించాం. అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాం.

---ప్రధాని నరేంద్ర మోదీ

రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ సమాఖ్య వ్యవస్థలో.. అన్ని రాష్ట్రాల పాత్ర ప్రధానమేనని ఉద్ఘాటించారు. సమష్టి కృషితో అభివద్ధి సాధించొచ్చని అభిప్రాయపడ్డారు.

"వన్ నేషన్-వన్ లెజిస్లేటివ్' అనేది మన పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక ప్రోత్సాహాన్ని అందిస్తుందనేది నా ఆలోచన. దేశంలోని ప్రజాస్వామ్య విభాగాలన్నింటినీ అనుసంధానించేందుకు కూడా ఈ విధానం దోహదపడుతుంది."

---ప్రధాని నరేంద్ర మోదీ

గత కొద్ది సంవత్సరాలుగా.. అందరి కృషితో.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈశాన్య సమస్యల పరిష్కారంతో పాటు.. దశాబ్దాలుగా నిలిచిపోయిన భారీ అభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్నామని మోదీ స్పష్టం చేశారు.

'టీకా మొదటి డోసు పూర్తయిన తొలి రాష్ట్రం..'

ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ రాష్ట్ర జనాభా అంతటికీ తొలి డోసు అందించినట్లు తెలిపారు. 75శాతం ప్రజలకు రెండో డోస్‌ను అందించినట్లు వివరించారు.

'ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. త్వరలోనే దేశం కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మకం ఉంది' అని ఠాకూర్ వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details