తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi return to India: దిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ - మోదీ గ్లాస్గో న్యూస్

ఇటలీ, యూకే పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... భారత్​కు (Modi return to India) చేరుకున్నారు. దిల్లీకి చేరుకున్న ఆయనకు.. అధికారులు స్వాగతం పలికారు.

Modi return to India
భారత్​కు చేరుకున్న మోదీ

By

Published : Nov 3, 2021, 8:37 AM IST

ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని భారత్​కు చేరుకున్నారు (Modi return to India) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎయిర్​ఇండియా వన్ విమానంలో దిల్లీలో దిగారు. ఆయనకు ఎయిర్​ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు.

దిల్లీకి చేరుకున్న తర్వాత మోదీ అభివాదం
.

ప్రధాని తన తాజా పర్యటనలో భాగంగా.. జీ20(Modi G20 speech), కాప్​26 (Modi Cop26 speech) ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కీలక ప్రకటన చేశారు మోదీ. 2070 నాటికి కర్బన ఉద్గారాల రహిత(నెట్ జీరో) దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. అంతకుముందు, కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జీ20 సదస్సులో పేర్కొన్నారు. 2022 చివరి నాటికి భారత్​ 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

మోదీకి అధికారుల స్వాగతం

పోప్​తో భేటీ

ఇటలీ పర్యటనలో (Modi Italy tour 2021) భాగంగా వాటికన్ సిటీని సైతం మోదీ సందర్శించారు. క్రైస్తవ మతగురువు, క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్​ను (Modi Pope Francis) కలిశారు. భారత్​కు రావాలని పోప్​ను మోదీ ఆహ్వానించారు. ఈ కథనం కోసం ఇక్కడ క్లిక్చేయండి.

డోలు వాయించి..

మంగళవారం గ్లాస్గోలోని హోటల్​ నుంచి బయలుదేరే ముందు అక్కడకు చేరుకున్న చిన్నారులతో ముచ్చటించారు మోదీ. ప్రవాస భారతీయులతో కలిసి సరదాగా డోలు మోగించారు. అనంతరం ఆయనకు వారు వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి:పేద దేశాలకు టీకా సాయం చేయాలని G-20 సదస్సులో పిలుపు

ABOUT THE AUTHOR

...view details