భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి నేడు. మహానేతకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లారు.
వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి.. ప్రముఖుల నివాళి - వాజ్‌పేయీ
దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు.
![వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి.. ప్రముఖుల నివాళి former PM Atal Bihari Vajpayee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12785502-thumbnail-3x2-atal.jpg)
వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సదైవ్ అటల్‌కు చేరుకొని వాజ్‌పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి:'ఏడేళ్లుగా ప్రధాని మోదీది అదే ప్రసంగం'