దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించాలన్న దురాలోచనతో కొందరు తమ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. నిజానిజాలేంటో ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచెప్పాలని భాజపా కార్యకర్తలకు సూచించారు.
భాజపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు మోదీ. సాగు చట్టాలు, సీఏఏ, కార్మిక చట్టాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చుతుందని కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. లేనిపోని అనుమానాలు, భయాలు సృష్టించి దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించాలన్నదే వారి ఉద్దేశం" అని అన్నారు.