ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ను గత ప్రభుత్వాలు నాశనం చేశాయని దుయ్యబట్టారు ప్రధనమంత్రి నరేంద్ర మోదీ(modi news). మహోబాలో రూ.3,240కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వారు మాఫియా చేతుల్లో బుందేల్‌ఖండ్‌ను పెట్టి అభివృద్ధికి నోచుకోనివ్వలేదని ఆరోపించారు. నూతన ప్రాజెక్టులతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని రైతులకు సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు(pm modi latest news).
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రతి మూలలో అభివృద్ధి జరుగుతోందని మోదీ అన్నారు(pm modi speech today). ఒకప్పుడు యూపీలోని అటవీ ప్రాంతాన్ని, వనరులను ప్రభుత్వాలు మాఫియా చేతుల్లో పెట్టాయని, తాము వారిపై బుల్డోజర్ ప్రయోగించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఇది చూసి కొందరు ఓర్వేలేక పోతున్నారని ఎద్దేవా చేశారు(pm modi up visit).