తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓట్ల కోసం ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం' - మోడీ బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్​ వే

PM Modi in UP: ఉచిత పథకాల హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. యూపీలో నిర్మించిన బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వేను ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​తో కలిసి ప్రారంభించారు.

Modi UP visit
pm narendra modi

By

Published : Jul 16, 2022, 3:02 PM IST

బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే

Modi UP visit: ఓట్లకోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా డబుల్‌ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని మోదీ స్పష్టంచేశారు.

బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే
బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే
బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే

ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు. రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వేను 6 లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్‌ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి దిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు.

బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే
బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే
బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వే

ABOUT THE AUTHOR

...view details