ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపర్చింది. 2019లో ఓ టీవీ ప్రోగ్రామ్లో మాట్లాడిన మోదీ.. "నేను కొలనులో స్నానం చేస్తుండగా.. ఓ మొసలి పిల్లను చూశాను. దానిని ఇంటికి తీసుకుని వెళ్లాను. మా అమ్మ దాన్ని చూసి తిట్టడం వల్ల తిరిగి ఆ కొలనులోనే వదిలిపెట్టి వచ్చాను" అని మోదీ చెప్పారు.
మొసలి పిల్లను ఇంటికి తీసుకువచ్చిన సన్నివేశాన్ని ఉదాహరణగా చూపించిన యాజమాన్యం.. 'నరేంద్ర దామోదర్దాస్ మోదీ భారత దేశానికి 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. ఆయన చిన్నతనం నుంచే ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. బాల్యంలోనే ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకువచ్చార'ని పుస్తకంలో ప్రచురించింది. ప్రధానమంత్రి యావత్ దేశానికి పర్యవేక్షకుడని ముద్రించింది.