డెన్మార్క్‌తో భారత్‌కు ఉన్న సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు (India Denmark news) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) పేర్కొన్నారు. డెన్మార్క్ ప్రధాని మేట్ ఫ్రెడ్రిక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఆయన.. కొవిడ్ సమయంలో ఇరుదేశాలు హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (India Denmark Green Strategic Partnership) ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. దీనిపై తాజా సమావేశంలో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమిలో (International Solar Alliance members) డెన్మార్క్ భాగస్వామి కావడం సంతోషకరమని ప్రధాని అన్నారు. (India Denmark relations)
"భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించాం. సప్లై చైన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఇరుదేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తరించాలని సంకల్పించుకున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
భారత్, డెన్మార్లు అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసం ఉంచే దేశాలని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ అన్నారు. హరిత అభివృద్ధి, హరిత పరివర్తనం.. రెండూ సమన్వయంతో పనిచేస్తాయనేందుకు భారత్, డెన్మార్ మధ్య సహకారం ప్రత్యక్ష ఉదహరణ అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు ఫ్రెడ్రిక్సన్.
"మొత్తం ప్రపంచానికి మీరు (ప్రధాని మోదీ) ఆదర్శం. 10 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన నీరు అందించే బృహత్తర లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకున్నారు. డెన్మార్క్‌ను సందర్శించేందుకు మీరు అంగీకరించడం మాకు గర్వకారణం."