తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi news: 'కర్తార్​పుర్​ కారిడార్ మళ్లీ​ తెరుచుకోవడం సంతోషకరం' - Modi news

గురునానక్​ జయంతి (Guru nanak jayanti) సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ జాతిని (Modi news) ఉద్దేశించి (Modi address to nation) ప్రసంగించారు. ఆయన మార్గంలో నడుస్తూ.. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

PM Modi to address nation
జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం

By

Published : Nov 19, 2021, 9:08 AM IST

Updated : Nov 19, 2021, 9:56 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. జాతిని ఉద్దేశించి (Modi address to nation) ప్రసంగించారు. సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్​ జయంతిని (Guru nanak jayanti) పురస్కరించుకొని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కర్తార్​పుర్​ కారిడార్​ తెరుచుకోవడం సంతోషకర విషయం అన్నారు.

అంతకుముందు మోదీ ట్వీట్​ చేశారు. సమ్మిళిత సమాజం గురించి గురునానక్​ చూపిన దృక్పథం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని, ప్రేరణగా నిలిచిందని అన్నారు. సేవ చేయడం ద్వారానే ప్రజలు జీవితాలు మెరుగుపడతాయని గురునానక్​ చెప్పారని, అదే మార్గంలో తమ ప్రభుత్వం పయనిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా.. ఉత్తర్​ప్రదేశ్​ మహోబాలో నీటిపారుదలకు సంబంధించి పలు పథకాలకు మోదీ (Modi news) శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రాష్ట్ర రక్షా సంపర్పణ్​ పర్వ్​ సందర్భంగా ప్రధాని.. ఝాన్సీకి వెళ్లనున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చూడండి: 'హిందుత్వంలో హిందూ భావనే లేదు.. అది సంఘీ ధర్మం'

Last Updated : Nov 19, 2021, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details