తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఫలితాలు దేశానికి గొప్ప సందేశం: మోదీ - మోదీ వార్తలు

PM Narendra Modi: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజాయన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు మోదీ. ఈ ఫలితాల్లో దేశానికి గొప్ప సందేశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

PM Narendra Modi
ఈ ఫలితాలు దేశానికి గొప్ప సందేశం: మోదీ

By

Published : Mar 10, 2022, 7:59 PM IST

Updated : Mar 10, 2022, 10:01 PM IST

Modi News: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా జయకేతనం ఎగురవేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారని అన్నారు. ఈ ఫలితాల్లో దేశానికి గొప్ప సందేశం ఉందని పేర్కొన్నారు. భాజపా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు చెప్పారు.

ఈ ఉత్సాహం భారత ప్రజాస్వామిక ఉత్సవం. ఈ ఎన్నికల ఫలితాల్లో గొప్ప సందేశం ఉంది. ఈసారి హోలీ పండుగ మార్చి 10నే మొదలైంది. ప్రజల హృదయాలు చూరగొనేందుకు కార్యకర్తలు ఎంతో శ్రమించారు. దేశానికి ఎందరో ప్రధానమంత్రులను యూపీ ఇచ్చింది. 37 ఏళ్ల తర్వాత యూపీలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో మా బలం మరింత పెరిగింది. మాపై నమ్మకముంచిన మాతృమూర్తులు, సోదరీమణులకు ధన్యవాదాలు. యూపీలో తొలిసారిగా భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది. గోవా ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారు. ఈ దేశంలో అవినీతి అంతం కావాలా? వద్దా? ప్రజాధనం దోచుకుని జేబులు నింపుకొనే వారిపై చర్యలు తప్పవు. ఏదో ఒక రోజు వారసత్వ రాజకీయాలు అంతమవుతాయి.

-ప్రధాని మోదీ

'ఆపరేషన్​ గంగ'ను ఆపేందుకు ప్రయత్నించారు

దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయమిదని మోదీ పిలుపునిచ్చారు. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తు కరోనా వల్ల చూశామని తెలిపారు. 'మేం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాం. కష్ట కాలంలో కొందరు దిగజారుడు రాజకీయాలు చేశారు. కొందరు నేతలు కరోనా వ్యాక్సిన్‌ను కూడా ప్రశ్నించారు' అని మోదీ పేర్కొన్నారు. 'ఆపరేషన్‌ గంగ'ను ఆపేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తారని యూపీలో రుజువైందని.. పేదలకు ఇల్లు, రేషన్‌, వ్యాక్సిన్‌ అందించడమే భాజపా లక్ష్యమని తెలిపారు అని ప్రధాని మోదీ అన్నారు.

దేశ రాజకీయాలను మోదీ సమూలంగా మారుస్తున్నారు: నడ్డా

దేశ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మారుస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీ, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లో ఓటర్ల ఆశీర్వాదంతో నెగ్గుకొచ్చామని, ఈ విజయం కోట్లాది భాజపా కార్యకర్తలదని పేర్కొన్నారు. యూపీ ప్రజలు వరుసగా రెండోసారి తమను ఆశీర్వదించారని తెలిపారు. విజయోత్సవ సభ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీపై భాజపా శ్రేణులు పూలవర్షం కురిపించారు. తొలుత కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీతోపాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. ప్రధాని మోదీని గజమాలతో సత్కరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 10, 2022, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details